Thursday, November 21, 2024

రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యెజన (పిఎంఆర్‌కెవివై) కృషోన్నతి యోజన(కెవై)లకు కేంద్ర మంత్రి మండలి గురువారం ఆ మోదం తెలిపింది. రైతుల ఆదాయం పెంపుదల దిశలో ఈ రెండు పథకాలు కీలకం అయ్యాయి. దేశంలో వ్యవసాయ స్వయం సమృద్థి స్థీరీకరణ, ఆహార భద్రతకు ఉద్శేశించిన ఈ రెండు పథకాల కు రూ. 1 లక్ష కోట్లకు పైగా వ్యయ అంచనాలు వేశారు. ఈ రెండు పథకాల అమలుకు మొత్తం వ్యయం రూ 1,01,321.61 కోట్లు అవుతుంది. ఇక వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని పలు స్కీమ్‌లను ఏకీకృత పథకం పరిధిలోకి తీసుకువ చ్చి, వీటిని హేతుబద్థీకరించే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు ప్రకటించాయి. దసరా , దీపావళి పర్వదినాల నే పథ్యంలో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ నిర్ణయానికి కూడా కేబినెట్ సమ్మతి తెలిపింది. ఉత్పాదన ఆధారిత బోనస్‌గా దీనిని 11.72 ల క్షల మంది ఉద్యోగులకు అందుతుంది.

దీనికి రూ.2028.57కోట్ల వ్యయం అవుతుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం వివరాలను ఆ తరువాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. బోనస్‌ను రైల్వేలోని వివిధ కేటగిరిల ఉద్యోగులు అంటే ట్రాక్ నిర్వాహకులు, లోకో పైలట్లు, గార్డు, స్టేషన్ మాస్టర్స్, సూపర్‌వైజర్లు, టెక్నిషియన్స్, హెల్పర్స్, పాయింట్స్‌మెన్, మినిస్టిరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ ఎక్స్‌సి స్టాఫ్‌నకు అందుతుందని అధికారిక ప్రకటన వెలువరించారు. సాధారణంగా రైల్వేలో ప్రతి ఏటా ఉత్పాదక ఆధారిత బోనస్‌ను ఉద్యోగులకు ప్రకటిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల పనితీరు మెరుగుదలలో ప్రోత్సాహకంగా ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడీ బోనస్ ప్రకటన వెలువడింది. ఇక రాబోయే ఆరేండ్లలో వంటనూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కీలక పథకం నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ పథకం పరిధిలో రూ 10, 103 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. వంటనూనెల దిగుతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరో ఐదు భాషలకు ప్రాచీన భాషల హోదా
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో మరో ఐదు ప్రాంతీయ భాషలకు ప్రాచీన భాషల హోదా కల్పన కూడా కీలకం అయింది. మరాఠీ, బెంగాళీ, పాళి, ప్రకృతి, అస్సామీ భాషలను ఈ హోదాలోకి తీసుకువస్తున్నట్లు సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే దేశంలో తమిళం, తెలుగు , సంస్కృతం, కన్నడం, మలయాళం, ఓరియాలకు ఈ విశిష్ట ముద్ర ఉంది. ఇప్పుడు కొత్తగా ఐదు భాషలు ఈ జాబితాలో చేరడంతో వీటి సంఖ్య ఇప్పుడు 11 కు చేరిందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News