Monday, December 23, 2024

చట్టం అందరికీ సమానంగా లేదు

- Advertisement -
- Advertisement -

‘భిన్నమైన దృశ్యాలు చూడాల్సిన భయంకరమైన రోజులివి. దేశ రాజధాని వీధుల్లో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జాతీయ గీతం పాడమని పోలీసులు అతన్ని బలవంతపెట్టి, పాడకపోయేసరికి దారుణంగా కొట్టారు. అతను మరణించాడు. అతని పేరు ఫైజన్. వయసు 23. పోలీసులపైన ఎటాంటి చర్య తీసుకోలేదు’ అని ప్రముఖ రచయిత్రి, బుకర్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ అన్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గత నెల ఆమె చేసిన ప్రసంగంలో కొంత భాగం. ‘ప్రజాస్వామిక ప్రపంచంలో ఇలాంటివేవీ ప్రధానమైనవి కావు. ఎందుకంటే తరువాత జరగవలసిన పనులు చాలా ఉంటాయి కనుక! అభివృద్ధి చెందుతున్న చైనాకు వ్యతిరేకంగా భారత దేశం పశ్చిమ దేశాలకు ఒక పెట్టని కోటలా తయారైంది. ఈ స్వేచ్ఛా విపణిలో ఒక సామూహిక అత్యాచారాన్ని కూడా సొమ్ము చేసుకుంటారు.

యుద్ధ విమానా లు, వాణిజ్య విమానాల కొనుగోలులో జరిగిన ఆర్థిక అవినీతి ఆరోపణలను తుడిచేసుకోవచ్చు. అమెరికా ఆంక్షలను అతిక్రమించి రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి యూరప్‌కు అమ్ముకోవచ్చు. మన వార్తా పత్రికల్లోనే కాదు, అమెరికాలోని వార్తా పత్రికల్లో కూడా ఈ వార్త వస్తుంది. ఉక్రెయిన్లకు మాతృభూమి ఉక్రెయినే. రష్యా వారికి అది వలస. అమెరికాకు, పశ్చిమ దేశాలకు వియత్నాం, అఫ్ఘానిస్తాన్ లాగా భారత దేశం కూడా ఎల్లలుగా పని చేస్తోంది. మోడీకి మాత్రం తనను ప్రదర్శించుకోవడానికి అదొక వేదిక. ఈరోజు ఆయన ఒక రాజనీతిజ్ఞుడిగా, శాంతి దూతగా తనను తాను ప్రదర్శించుకోడానికి ‘ఈ యుగం యుద్ధ యుగం కాదు’ అంటారు.

కానీ అంతరంగంలో అత్యాధునికమైన హద్దులున్నాయి. అవ్వొక ఆరాధన లాగా పెరుగుతున్నాయి. చట్టం అందరికీ సమానంగా లేదు. కులం, మతం, వర్గం, లింగ భేదాలపై ఆధారపడి చట్టం అమలు జరుగుతోంది. హిందువు చేసినట్టుగా ముస్లిం చేయలేడు. మిగతా వారు మాట్లాడినట్టుగా ఒక కశ్మీరీ మాట్లాడలేడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. కానీ ఇది ఒక ప్రమాదకరమైన పరిణామం. ఇలాంటి సమయంలో అనేక విషయాలు చెప్పలేను. చెపితే అవి చాంతాడంత అవుతాయి. వీటన్నిటినీ ప్రభుత్వం, ప్రధాన పత్రికా ప్రపంచం అదుపు చేస్తాయి. పశ్చిమ దేశాలలో తెల్లవారు ఆ పని చేస్తారు. భారత దేశంలో బ్రాహ్మణీయ సమూహం చేస్తుంది. అప్పుడు ఫత్వా జారీ చేసే అవకాశం వస్తుంది. అన్నిటికీ వ్యతిరేకంగా సెన్సార్ షిప్ ఒక యుద్ధ భూమిలా తయారైంది. లలిత కళలు కూడా ప్రపంచ పరిశ్రమగా మారిపోయాయి. ఇతర దేశాలలో లాగానే భారత దేశంలో కూడా ప్రతిఘటన పేరుతో ఆయుధీకరణ పెరిగిపోయింది.

చారిత్రకంగా పీడనకు, అణచివేతకు గురవుతూ, బానిసలుగా, వలసలుగా, తుడిచివేతకు గురవుతున్నాం. మనం జాతి, కులం, లింగ తేడాతోనే చారిత్రకంగా గుర్తింపు పొందాం. ఇప్పుడు పీడనకు వ్యతిరేకంగా పోరాడడం ద్వారా రెట్టింపు గుర్తింపు పొందుతున్నాం. చరిత్రలో ఇది బలమైన విస్పోటన సమయం. ఎప్పుడూ ప్రశ్నించని పాత ఆలోచనలనతో, పాత ప్రవర్తనా పద్ధతులతో, మతోన్మాదంతో, పక్షపాత బుద్ధితో నిండిన పదాలతో సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణం జరిగే ఈ తీవ్రత వల్ల ఆత్మసంతృప్తి గల ప్రపంచం ఆశ్చర్యంలో మునిగి పునరాలోచించడం మొదలు పెట్టింది. దీనికి భిన్నమైన మంచి మార్గం కోసం అన్వేషిస్తోంది. ఇప్పుడున్న ధోరణి ఫాసిజం వైపు దారితీస్తోంది.
మనపైన అధికారం చెలాయించేవారు మనకిచ్చిన గుర్తింపులతో, మనకు వేసిన ముద్రలతో జైలు గదిలో మనల్ని మనం బంధించుకుంటే, జైలు తిరుగుబాటు వేదికగా ఉన్నట్టు లెక్క.

లింగపరంగా, మతాలుగా, కులాలుగా, గ్రూపులుగా, జాతులుగా మనకు మనం ముద్ర వేసుకున్నాం. మనని గోతుల్లోకి తోసేస్తున్నారు. హిందూ కుల వ్యవస్థ లక్ష్యం అదే. పగలకొట్టలేని పెట్టెల్లా, నిచ్చెన మెట్ల వ్యవస్థగా మనల్ని విభజించేశారు. ఒక వర్గం బాధలను మరొకరు అర్థం చేసుకోలేని విధంగా తయారైంది. ఎందుకంటే వారి మధ్య అనేక ఘర్షణలున్నా యి. అదొక జటిలమైన పాలనా వ్యవస్థ. వ్యవస్థ స్థాపించిన మనుగడ యంత్రాంగం తనను తాను నడుపుకుంటుంది. ఈ క్రమంలో దాని నిర్మాణమంతా పీడనలో ఉంటుంది. అత్యున్నత స్థితిలోను, అధమ స్థితిలోనూ ఉన్న వాళ్ళు తమకు తప్ప మిగతా అందరికీ స్థాయిలను నిర్ణయిస్తారు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఒకరు మరొకరిని పీడిస్తే, వారు మరొకరిని పీడిస్తారు. ఒక్కసారి ఈ సరిహద్దు కంచెను వేస్తే, ఏ ఒక్కరూ స్వచ్ఛతా పరీక్షలో నెగ్గలేరు. ఒకనాటి మంచి ఆలోచన, గొప్ప సాహిత్యం అనేది ఉండదు. షేక్స్పియరైనా, టాల్‌స్టాయ్ అయి నా సరే. అతని రష్యన్ సామ్రాజ్య వాదాన్ని పక్కన పెడితే, అతను అన్నాకరెనినా అనే మహిళ అంతరంగాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో ఊహించవచ్చు.

దోస్తోవస్కీ కూడా ఒక వృద్ధురాలిని అసహ్యకరమైన ముసిలిదిగా సంబోధిస్తాడు. కానీ అతని రచనలు చదవడానికి ప్రజలు ఇష్టపడతారు. మీకిష్టమైతే గాంధీ రచనలు చదవండి. ప్రతి దశలోనూ జాతి, కుల, లింగ భేదం, వర్గం వంటి వాటిలో దిగ్భ్రాంతి చెందుతారు. వాటిని నిషేధించమని అర్థం కాదు కదా? తిరగ రాయాలని కూడా కాదు కదా? ఈ ప్రమాణాలతో ప్రతి పవిత్రమైన మత గ్రంథం ఫలితం సాధించలేదని, దాని పాటికి అది వెళ్ళిపోతుంది. మధ్యలో ప్రజా ఉపన్యాసాల రణగొణ ధ్వనులు వినిపిస్తుంటాయి.ఒక రకమైన మేధో స్తబ్ధతలోకి మనం జారిపోతాం. అసమానత అనేది పుట్టుకతో వచ్చింది కాదు. దాన్నెప్పుడూ సవాలు చేయాలి, విశ్లేషించాలి, వాదించాలి, దాన్ని కొలవాలి. దాన్ని నిరోధించడం ద్వారా దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పకుండానే పునరుద్ధరిస్తాం.

సాహిత్యానికి ఇవి ఏం చేస్తాయి? ఒక సృజనాత్మక రచయితగా కొన్ని విషయాలు నన్ను ఎక్కువగా కలవరపెడతాయి. వాటిలో నూతన సెన్సార్ షిప్ అనేది ఒకటి. ఈ సందర్భంలో సరిగ్గా తగినది, మొరటుగా పెట్టినది, క్రూరత్వం గురించి, పశ్చాత్తాపం చెందేవారు కూడా రాయడానికి, చెప్పడానికి అవే కథలు చెపుతారు. కానీ, నిషేధించడం కానీ, కోత విధించడం కానీ మంచిది కాదు. ఒక రకమైన ప్రజల గురించి ఎక్కువగా విన్నాం, కానీ మరొక రకమైన ప్రజల గురించి చాలా తక్కువగా విన్నాం. జీవితపు అల్లిక చాలా లోతైనది, కఠినమైనది. దాని సృష్టి కర్తలు, దాని పనులు అత్యవసరమైనవిగా కాలేవు. భాష పక్షపాతంతోను, మతోన్మాదంతోనూ నిండి ఉంది.

సృజనాత్మక రచనలకు వద్దాం. తగినట్టుగా లేకపోతే సృజనాత్మకత ఉండదు. సృజనాత్మక రచయితలు కూడా ఇతరుల కోసం ఎదురు చూసే వాళ్ళం. మన సృజనాత్మక ప్రపంచాన్ని నిర్మించుకోడానికి మన మార్గానికి భిన్నంగా ప్రతి దానిని స్వీకరిస్తాం. గొప్ప నవలలను కూడా అదే ప్రమాదకరంగా, దృశ్యమానం చేస్తాం. నా గురించి నేను చెప్పుకోవాలంటే టోని మిరిసన్, జేవ్‌‌సు బాల్డవిన్ వంటి రాజకీయంగా అనుసరించకూడని రచయితలు, సామ్రాజ్యవాద రచయిత క్లిప్పింగ్ నుంచి, మతోన్మాదులు, జాతి ఉన్మాదుల నుంచి, ఇబ్బందులు కలగజేసే రాస్కెల్స్ నుంచి కూడా వారి రచనా ప్రతిభను స్వీకరించాను. గొప్ప రచనలు మళ్ళీ తిరిగి ముస్తాబవుతాయా? మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాయి? పాదముద్రలు లేకుండా ఏ తీరానికి? చరిత్ర లేని ప్రపంచానికి?

ఈ అల్లిక ద్వారా సాహిత్యం సమీకరణ లేకుండా ఉన్నట్టయితే, వెయ్యి గొంతులు మొరుగుతాయి. ఒక రకమైన దృఢ, ప్రణాళికలా తయారవుతాయి. ఒక విషాదం ఏమిటంటే, దీనిని ఎవరైతే ఆసక్తికరంగా పర్యవేక్షిస్తారో, వారు ఇతరులను శిలల్లా చేస్తారో, తమని తాము కూడా శిలలుగా మార్చుకుంటారు. వారు మందుపాతరలు అమర్చి, వాటిపైన తాము కూడా పాదం మోపుతామని కూడా వారికి తెలుసు. పంజరంలో జాగ్రత్తగా మనసులు నాట్యం చేయలేవు. ఈ భారం మాత్రమే కొత్త భాషలోకి నడుస్తుంది. కొత్తవి మాట్లాడతాయి. నేను తొలిసారిగా నవలను ముద్రిస్తున్నప్పుడు, భారత దేశం బైట మాట్లాడవలసి వచ్చినప్పుడు, స్టేజి పైన “భారతీయ మహిళా రచయిత” (బుకర్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ) అని పరిచయం చేశారు. ప్రతి తడవ నాకిలా ముద్ర వేయడం ఆశ్చర్య అనిపించింది. ఇది అవసరమా, పరిమితం చేయడం, చుట్టుముట్టడానికి ఇది మార్గమా? దీని తరువాత మనం మాట్లాడుతున్నది సాహిత్యం గురించి కానీ, వీసా దరఖాస్తు గురించి కాదు.

ప్రైవేటుగా కాకుండా గౌరవనీయులైన మనుషులనే పేరిట మాట్లాడుతున్నాం. నేను ఉపన్యాసాలిస్తూనే ఉన్నందుకు నాకు విసుగనిపించింది. ఎట్లా రాయాలి, ఏం రాయాలి, ఏ గొంతుతో చెప్పాలి, నాలాంటి రచయిత్రులకు ఏ విషయాలు సరిపోతాయి వంటి వన్నీ వార్తా పత్రికల్లో మొదటి పేజీలో వస్తున్నాయి. పిల్లల కథలు రావాలని ఎక్కువగా సూచిస్తున్నాను. సూత్రప్రాయంగా నేను చెప్పేది వాళ్ళు అంగీకరిస్తే చాలు, సృజనాత్మక రచనలా, కాదా అన్నది నేను పట్టించుకోవడం లేదు. సృజనాత్మకం కాని రచనలు కూడా సాధ్యమైనంత ఎక్కువగా రావాలి. భారీ ప్రాజెక్టులపైన నా రాతలకు కోర్టు ధిక్కరణ కింద నన్నొక సారి సుప్రీంకోర్టుకు లాగారు. విచారణ సందర్భంగా బెంచిలో సోదర న్యాయమూర్తులు ‘ఆ మహిళా’ అంటూ నన్ను విసిరేసినట్టు నన్ను సంబోధించారు. వాళ్ళ ముందర నేను నిలుచోలేదు. బుకర్ ప్రైజు తీసుకున్న ‘హెకర్’ (‘వేశ్య’)ను నేనే అని ప్రైవేటుగా నా గురించి నేను చెప్పుకున్నాను. నేను క్షమాపణ చెప్పనందుకు నేనొక ‘సహేతుకమైన మనిషి’ని కానని ఒక రోజు జైలులో పెట్టారు.

అప్పటి నుంచి విషయాలు మారిపోతున్నాయి. ఆ జాబితాలో నన్ను భారతీయురాలు, మహిళ, రచయిత్రి అనే పదాలతో ఒక్కోసారి ఒక్కోరకంగా నా పేరు రాస్తున్నారు. ఈ రోజుల్లో విషయ శీర్షిక ఆత్రుతతో, కఠినంగా, దాదాపు సరిదిద్దలేని వైరుధ్యంతో ఉంటున్నాయి. మహిళ అంటే ఎవరు? మనిషంటే ఎవరు? దేశం అంటే ఏమిటి? పౌరులు అంటే ఎవరు? ఈ బహిరంగ యుగంలో రచయిత అంటే ఎవరు? చాలా మంది ఒప్పుకోకపోవచ్చుకానీ, మనకు తెలుసు, పురుషుడికి, స్త్రీకి మధ్య ఉండే సరిహద్దు సంప్రదాయం ఊహించుకునేటటువంటిది కాదు. అది ఒక ద్రవం లాంటిది. యంత్రానికి, మనిషికి మధ్య భావాల బట్వాడాకు, కళకు మధ్య, కృత్రిమ మేధకు, మానవ చైతన్యానికి మధ్య సరిహద్దు ఏమిటి?

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News