Monday, December 23, 2024

భారత న్యాయ వ్యవస్థ

- Advertisement -
- Advertisement -

బ్రిటీష్ కాలంలో న్యాయవ్యవస్థ..

India law telugu history

బ్రిటీష్‌కు పూర్వం దివ్య పరీక్షలు ఉన్నాయి.
బ్రిటీష్ వారు దివ్య పరీక్షలు రద్దు చేసి అద్భుతమైన న్యాయవ్యవస్థను పరిచయం చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటగా రెండు న్యాయస్థానాలు ఏర్పాటు చేసింది.
1. సదర్ దివాని అదాలత్ (ఉన్నత సివిల్ కోర్టు)
2. సదర్ నిజాయత్ అదాలత్ (ఉన్నత క్రిమినల్ కోర్టు)
1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774 లో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడింది.
ఈ కోర్టు పేరు సుప్రీం కోర్టు, కాని ఈ కోర్టు ఇచ్చిన తీర్పును బ్రిటన్‌లోని ప్రివి కౌన్సిల్‌కి అప్పీల్ చేసుకోవచ్చు.
భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రారంభించినది వారన్ హేస్టింగ్స్
కారన్ వాలిస్ సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు.
న్యాయవ్యవస్థను అభివృద్ధి చేసింది కారన్ వాలిస్
భారతదేశంలో న్యాయవ్యవస్థ పితామహుడుగా కారన్‌వాలిస్ పిలవబడ్డాడు.
విలియం బెంటిక్..
విలియం బెంటిక్ కాలంలో లా కమిషన్ ఏర్పడింది.
తొలి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే.
లా కమిషన్ విధి న్యాయ వ్యవస్థలో మార్పులు చేస్తుంది.
లార్డ్ మెకాలే కాలంలో చేపట్టినవి
1859లో సివిల్ ప్రొసిజర్ కోడ్ (సిపిసి)
1860లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)
1861లో క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సిఆర్‌పిసి)
1861 చట్టం ప్రకారం 3 హైకోర్టులు ఏర్పడ్డాయి.
1862లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులు ఏర్పడ్డాయి.
ఈ మూడు హైకోర్టుల తర్వాత 1866లో అలహాబాద్ హైకోర్టు ఏర్పడింది.
లార్డ్‌రిప్పన్ కాలంలో..
1883 రిప్పన్ హిల్బర్ట్ బిల్ ప్రవేశపెట్టాడు.
భారతీయ న్యాయమూర్తులు తెల్లవారిని విచారించే అధికారం ఈ బిల్లులో ప్రస్తావించాడు.
ఈ బిల్లు నెగ్గక పోవడంతో రాజీనామా చేశాడు.
రాజీనామా చేసిన ఏకైక గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్
1935 చట్టం ప్రకారం ఢిల్లీలో ఒక ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేశారు.
భారతీయ న్యాయవ్యవస్థ..

భారతదేశంలో న్యాయశాఖ విభజన లేదు.
అంతిమ కోర్టు సుప్రీంకోర్టు అనగా భారతదేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థ కలదు.
న్యాయశాఖ విధానాలు
భారత దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంది.
న్యాయవ్యవస్థకు న్యాయసమీక్షా అధికారం ఉంది.
న్యాయ సమీక్ష చట్టంలోని లోపాలను చట్టం అమలులో లోపాలను సమీక్ష చేస్తుంది.
న్యాయ సమీక్ష అధికారం కూడా రాజ్యాంగంకు లోబడే ఉండాలి.
దేశంలో అత్యున్నత శాసనం భారత రాజ్యాంగం.
రాజ్యాంగంను వ్యాఖ్యానించు అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది.
రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.
సుప్రీం కోర్టు నిర్మాణం

ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీం కోర్టు ఉంటుంది.

ఎంత మంది న్యాయమూర్తులుండాలి అనే విషయం పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
హైకోర్టు: ఆర్టికల్ 214 ప్రాకారం ప్రతి రాష్ట్రానిక హైకోర్టు ఉంటుంది.
దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి తో పాటు ఇతర న్యాయమూర్తులుంటారు.
ఇతర న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
న్యాయమూర్తుల నియామకం
సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించి నియామకం చేస్తారు.
కొలీజియం సిఫార్సు చేసిన పేరును కేంద్ర క్యాబినేట్‌కు పంపిస్తుంది.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించవచ్చు లేదా వెనక్కి పంపవచ్చు.
ఒక వేళ కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదానికి వెళుతుంది.
కొలీజియంకు వెనక్కి పంపిన పేరును కొలీజియం రెండోసారి ఆమోదించి పంపితే క్యాబినెట్ తప్పని సరిగా ఆమోదించాలి.
న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర కేబినెట్ కంటే కొలిజియంకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి.
ప్రమాణ స్వీకారం..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
పదవికాలం..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వరకు పదవిలో కొనసాగుతారు.
హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్ల వయసు వరకు పదవిలో కొనసాగుతారు.
రాజీనామా : సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.
ప్రధాన న్యాయమూర్తి నియామకం
సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో సీనియర్ న్యాయూర్తిని సిజేఐగా రాష్ట్రపతి నియామకం చేస్తారు.
1973లో 4వ స్థానంలో ఉన్న ఎ.ఎన్.రే ని సిజేఐగా నియామకం చేశారు.
1977లో 4వ స్థానంలో ఉన్న భేగ్‌కి ఇచ్చారు.
తొలగింపు
అసమర్ధత, నిరూపించబడిన దుష్ట ప్రవర్తన, అవినీతి వంటి కారణాల చేత వారిని తొలగించవచ్చు.
న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని అభిశంసన తీర్మానం అని అంటారు.
ఎంపీలు ఏ సభలో నైనా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.
లోక్‌సభలో అయితే వంద మంది సంతకాలతో స్పీకర్‌కి సమర్పించాలి.
రాజ్యసభలో అయితే యాబై మంది సభ్యుల సంతకాలతో చైర్మన్‌కి సమర్పించాలి.
తీర్మానాన్ని సభాపతి ఆమోదించి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
విచారణ కమిటీ సభ్యులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి/సీనియర్ న్యాయమూర్తులు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి /సీనియర్ న్యాయమూర్తి
న్యాయనిపుణుడు.
విచారణ కమిటీ ఆరోపణలు అవాస్తవం అని చెబితే తీర్మానం రద్దవుతుంది.
వాస్తవం అయితే సభలో చర్చకు వచ్చి ఓటింగ్ జరుగుతుంది.
సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు ఆమోదిస్తే తీర్మానం 2వ సభకు వెళుతుంది.
రెండోసభ కూడా 2/3 మెజారిటీతో ఆమోదిస్తే రాష్ట్రపతి ఆ న్యాయమూర్తిని తొలగిస్తాడు.
ఇప్పటి వరకు ఒక్క న్యాయమూర్తిని కూడా తొలగించలేదు.

 

ప్రధాని..
మంత్రి మండలి పదవికాలం..
సాధారణంగా 5 ఏళ్లపాటు పదవిలో కొనసాగుతారు. కాని లోక్‌సభ, రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో ఉంటారు.
రాజీనామా : రాష్ట్రపతికి సమర్పించాలి.
తొలగింపు..
లోక్‌సభలో విశ్వాస పరీక్ష ఓడితే.
లోక్‌సభలో అవిశ్వాసం నెగ్గితే.
లోక్‌సభలో ప్రభుత్వ బిల్లు ఓడిపోతే.
ప్రభుత్వం వ్యతిరేకించిన ప్రైవేటు బిల్లునెగ్గితే.
బడ్జెట్‌పై ఓటింగ్‌లో ఓడినప్పుడు.
బడ్జెట్‌లో కోత తీర్మానం నెగ్గినప్పుడు.
రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయినప్పుడు.
మంత్రి మండలి..
మంత్రి మండలి వర్గీకరణ రాజ్యాంగంలో లేదు.
రాజ్యాంగ రీత్యా మంత్రి మండలిలో సభ్యులందరూ సమానమే.
కాని నెహ్రూ ప్రభుత్వం మంత్రి మండలి వర్గీకరణపై గోపాల స్వామి అయ్యంగార్ కమిటీని విధించింది.
ఈ కమిటీ మంత్రి మండలిని 3 రకాలుగా వర్గీకరించింది. అవి
1. క్యాబినెట్ మంత్రులు పెద్ద శాఖలు
2. స్టేట్ మంత్రులు చిన్న శాఖలు
3. డిప్యూటీ మంత్రులు సహాయ మంత్రులు
మంత్రి మండలి సభ్యుల సంఖ్య
91వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభలోని సభ్యుల సంఖ్యలో మంత్రి పదవులు 15% మించరాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News