Tuesday, March 4, 2025

భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్టస్థితిలో నిలిచింది. భారత బౌలర్లు విజృంభిచడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ 150 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 133.5 ఓవర్లలో 404 పరుగులకు ఆలౌటైంది.

తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య బంగ్లాదేశ్ గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆరంభం నుంచే భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. 133/ 8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ మరో 17 పరుగులు మాత్రమే జోడించి 150 రన్స్‌కు ఆలౌట్‌ అయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 3, కుల్దీప్‌ యాదవ్‌ 5, ఉమేశ్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News