- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 2,031 వరకు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. గత 24 గంటల్లో కర్ణాటక నుంచి ఒకరు, పశ్చిమబెంగాల్ నుంచి ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం క్రియాశీల కేసుల్లో 92 శాతం మంది ఇంటివద్దనే ఐసొలేషన్‌తో కోలుకున్నారని అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ జెఎన్.1 ఎలాంటి అసాధారణ వ్యాప్తి కాలేదని, అలాగే ఏ ఒక్కరూ ఆస్పత్రి పాలు కాలేదని అధికార వర్గాలు వివరించాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4.4 కోట్ల మంది కోలుకోగా, రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. అలాగే ఇంతవరకు 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
- Advertisement -