Monday, December 23, 2024

గత 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలు

- Advertisement -
- Advertisement -
తాజాగా 5,357 మందికి పాజిటివ్
అదే సమయంలో 11 మంది మృతి
పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది

న్యూఢిల్లీ:  భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా- రోజువారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు పైన నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 5,357 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 11 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.  పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉంది. కాగా, భారత్ జనాభాతో పోల్చితే, ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరమేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు భావించాలని ముంబయి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ తను సింఘాల్ వెల్లడించారు.

భారత్ లో ప్రస్తుతం ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 2 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే న్యూజిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News