- Advertisement -
న్యూఢిల్లీ : కొవిడ్ జెఎన్.1 భయం వెంటాడుతుండగాఒకే ఒక రోజులో కొవిడ్ 19 కేసులు 656 కి పెరిగాయి. అంతకు ముందు రోజు క్రియాశీల కేసులు 3420 నుంచి 3742 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. గత 24 గంటల్లో కేరళలో ఒక మరణం సంభవించగా, దేశం మొత్తం మీద మరణాల సంఖ్య 5,33,333 కి చేరింది. మరణాల రేటు 1.18శాతం ఉంది. కేరళలో ఒకే ఒక రోజున క్రియాశీల కేసులు 126కు చేరుకోగా, కర్ణాటకలో 96, మహారాష్ట్రలో 35, ఢిల్లీలో 16, తెలంగాణలో 11, గుజరాత్‌లో 10,వరకు కేసులు పెరిగాయి. 333 మంది వరకు కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.44 కోట్లకు చేరాయి. దేశం మొత్తం మీద రికవరీ రేటు 98.81 శాతం కాగా, ఇంతవరకు 220.67కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.
- Advertisement -