- Advertisement -
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ – 2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వార్షుస్ బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్(8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(28) కూపర్ కొన్నోలీ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లీ(14), శ్రేయస్(12) ఉన్నారు.
- Advertisement -