- Advertisement -
న్యూఢిల్లీ: నేడు (బుధవారం) ఇక్కడి మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన హాకీ పోటీలో ఒలింపిక్ కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు తొలి టెస్టులోనే ప్రపంచ ఛాంపియన్ జర్మనీ చేతిలో 0-2 తేడాతో ఓడింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1 ఆధిక్యంతో జర్మనీ నిలిచింది.
ఒలింపిక్ రజత పతక విజేతగా కొనసాగుతున్న జర్మనీ ఈ సిరీస్‌కు యువ జట్టును రంగంలోకి దించింది. మొదటి మ్యాచ్‌లో హెన్రిక్ మెర్ట్‌జెన్స్ (4వ నిమిషం) , కెప్టెన్ లుకాస్ విండ్‌ఫెడర్ (30వ) విజయవంతమైన గోల్‌లు చేయడంతో జర్మనీ సత్తాను చాటుకుంది. సిరీస్‌లో రెండో టెస్టు గురువారం జరగనుంది.
- Advertisement -