Wednesday, January 22, 2025

కివీల క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

సొంత గడ్డపై టీమిండియాకు ఘోరపరాభావం ఎదురైంది. న్యూజిలాండ్ జట్టు చేతిలో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. స్వదేశంలో భారత్ జట్టుకు వైట్‌వాష్ కావడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్‌సేన అజాజ్ పటేల్ 6/57, గ్లెన్ ఫిలిప్స్ 3/42 బౌలింగ్ దాటికి 29.1 ఓవర్లలో 121 పరుగులకే చాపచుట్టేసింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం సయితం ఫలించలేదు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 147 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభం నుంచి భారత్ తడబాటుకు గురైంది.

29 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా (6)తో కలిసి రిషబ్ పంత్ ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత శిబిరంలో గెలుపు అవకాశాలు మెండుగా కనిపించాయి. అయితే పంత్ మినహా భారత్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. రోహిత్ శర్మ (11), వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు మాత్రమే చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 8, రవీంద్ర జడేజా 6, యశస్వీ జైస్వాల్ 5, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ తలో ఒక్క పరుగు చేశారు. దీంతో భారత్ భారీ పరాభావాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.

14 బంతులకే చివరి వికెట్..
అంతకుముందు 171/9 మూడో రోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్ మరో 14 బంతులే ఎదుర్కొని, మూడు పరుగులు చేసి చివరి వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (51) టాప్ స్కోరర్. గ్లెన్ ఫిలిప్స్ (26), డెవాన్ కాన్వే (22), డారిల్ మిచెల్ (21) పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో జడేజా 5 వి కెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. ఆ కాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 65.4 బంతుల్లో 235 పరుగులు చేయగా భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసింది. భారత్‌కు 38 పరుగుల ఆదిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News