Monday, December 23, 2024

తొలి వన్డే.. భారత్ స్కోర్ 78/4

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాంఖేడ్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్(3) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ(4) ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) డక్ ఔట్ అయ్యాడు. శుభ్ మన్ గిల్(20) మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నది. క్రీజులో కెఎల్ రాహుల్ (24) పరుగులు, పాండ్యా (23)పరుగులతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News