Monday, December 23, 2024

విరాట్, అశ్విన్ ఔట్.. టీమిండియా 162/6

- Advertisement -
- Advertisement -

India loss 6 wickets for 162 runs

కేప్‌టౌన్: న్యూలాండ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు భారత్ జట్టు 53 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 162 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా ఇప్పటివరకు 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. రిషబ్ పంత్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ 143 బంతులు ఆడి 29 పరుగులు చేసి ఎంగిడి బౌలింగ్ లో మార్కన్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రవిచంద్రన్ అశ్విన్ ఏడు పరుగులు చేసి ఎంగడి బౌలింగ్ లో జాన్సన్ కు క్యాచ్ ఆరు వికెట్ రూపంలో ఔటయ్యాడు. భారత బ్యాట్స్‌మెన్లలో కెఎల్ రాహుల్ (10), మయాంక్ అగర్వాల్(07), ఛటేశ్వరా పూజారా(09), అంజిక్య రహాన్ (01) పరుగులు చేసి మైదానం వీడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా, మార్కో జన్‌సేన్, ఎంగిడి తలో రెండు వికెట్లు పడగొట్టగారు. ప్రస్తుతం క్రీజులో శార్థూల్ టాగూర్ (0), రిషబ్ పంత్ (77) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా రెండో రోజుల ఆట మిగిలి ఉంది. భారత్-సౌతాఫ్రికా చెరో ఒక మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210
ఇండియా తొలి ఇన్నింగ్స్: 223

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News