కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 118 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 230 పరుగుల ఆధిక్యంలో ఉంది. విరాట్ కోహ్లీ 44 పరుగులు చేసి మోయిన్ అలీ బౌలింగ్లో క్రేగ్కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్ రూపంలో ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 17 పరుగులు చేసి క్రిష్ వోక్స్ బౌలింగ్లో ఎల్బిడబ్లుగా ఔటయ్యాడు. అజింక్య రహానే పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వోక్స్ బౌలింగ్లో ఎల్బిడబ్లు రూపంలో మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (16), శార్దూల్ టాకూర్(11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, క్రిష్ వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్, మోయిన్ అలీ చెరో ఒక వికెట్ తీశారు. మూడో రోజు రోహిత్ శర్మ (127) సెంచరీతో మోత మోగించిన విషయం తెలిసిందే.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 191
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290