Sunday, January 5, 2025

ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 67 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా నడ్డివిరిచాడు. బోలాండ్ బౌలింగ్ ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్లు గజగజవణికిపోయారు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్లు వంద బంతులు ఎదుర్కొకుండా వెనుదిరిగారు. రిషబ్ పంత్ (40), రవీంద్ర జడేజా(26), శుబమన్ గిల్(20), విరాట్ కోహ్లీ(17), యశస్వి జైస్వాల్(10), కెఎల్ రాహుల్(04) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(14), ప్రసిద్ధ కృష్ణ(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు, నాథన్ లయాన్, కమ్నీస్ చెరో ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News