Sunday, January 5, 2025

భారత్‌పై పాక్ విజయం

- Advertisement -
- Advertisement -

ఆసియా అండర్19 వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ 44 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. శనివారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆల్‌రౌండ్‌షోతో భారత్‌ను కంగుతినిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా యువ జట్టు 237 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు ప్రారంభమయ్యాయి.

పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు. ఆయుష్ మాత్రే (20), సిద్ధార్థ్ (15), కెప్టెన్ మహ్మద్ అమన్ (16), కిరణ్ చోర్మలే (20), హర్వాన్ష్ సింగ్ (26) పరుగులు చేశారు. ఇక యుధాజిత్ గుహ 12 (నాటౌట్), మహ్మద్ ఈనాన్ (30) చివరి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ నిఖిల్ కుమార్ ఆరు ఫోర్లు, 3 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో అలీ రజా మూడు, అబ్దుల్ సుభాన్, ఫహమ్ ఉల్ హక్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News