Sunday, November 24, 2024

సైన్యంలో ప్రవేశపెట్టిన స్వదేశీ పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’

- Advertisement -
- Advertisement -

Prachand

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం తన పోరాట పటిమకు పెద్ద ఊతమిచ్చేందుకు, అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో  ‘ప్రచండ్’ అనే పేరుతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన తేలికపాటి పోరాట హెలికాప్టర్‌లలో మొదటి బ్యాచ్‌ను సోమవారం ప్రవేశపెట్టింది. కాగా ఈ  5.8 టన్నుల ట్విన్ ఇంజన్ హెలికాప్టర్ ఇప్పటికే వివిధ ఆయుధాల ఫైరింగ్ పరీక్షలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్ డిజైన్ పూర్తిగా భారతీయమైనది. లడఖ్ వద్ద ఈ హెలికాప్టర్ ని పరీక్షించారు. ఇది గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో చైనా డ్రోన్‌లను దెబ్బ తీయగలదు.  అంతేకాక  నేలపై ఉన్న ట్యాంకులను కూడా దెబ్బ తీయగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News