Friday, January 10, 2025

భారత్‌తో మాల్దీవుల సంబంధాలను చెడగొట్టలేం

- Advertisement -
- Advertisement -

మాలే : మాల్దీవుల కొత్త ప్రభుత్వం విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చినప్పటికీ, భారత్‌తో సంబంధాలను చెడగొట్టలేమని ప్రఖ్యాత మాల్దీవుల రాజనీతిజ్ఞుడు, మాల్దీవుల విపక్ష నూతన నాయకుడు అబ్దుల్లా షహీద్ వెల్లడించారు. సన్‌ఆన్‌లైన్ అనే సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో భారత్‌తో సంబంధాలను గట్టిగా సమర్ధించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం మాజీ అధ్యక్షుడు, 61 ఏళ్ల షహీద్ భారత్‌తో మాల్దీవులకు భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎన్నో ఏళ్ల నుంచి సంబంధాలు పెనవేసుకుని ఉన్నాయని పేర్కొన్నారు.

అధ్యక్షునిగా మొహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి చైనాకు అనుకూల వ్యక్తిగా భారత్‌తో సంబంధాలు క్షీణించడం ప్రారంభమైందని విమర్శించారు. మాల్దీవులకు వచ్చే ఎన్నో ఆపదసమయాల్లో భారత్ అండగా నిలించిందని, 2004 సునామీ విపత్తు లోనూ , 2020 కొవిడ్ మహమ్మారి సమయం లోనూ భారత్ ముందుకు వచ్చి మాల్దీవులకు సహాయం అందించిందని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News