Thursday, January 23, 2025

మాల్దీవులతో బంధం ప్రత్యేకమైంది: రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మూడు రోజులు మాల్దీవుల్లో పర్యటన కోసం మంగళవారం చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశానికి భారత దేశం కానుకగా ఒక ఫాస్ట్ పెట్రోలింగ్ నైక, ఒక ల్యాండింఘ క్రాఫ్ట్‌ను అందేజేశారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునే అంశంపై మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్‌తో చర్చలు జరిపారు. భారత బహుమతులను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ.. భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలు నిజంగా ప్రత్యేకమైనవని, ఈ ప్రాంతమంతటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, మాల్దీవులతో పాటుగా ఈ ప్రాంతంలోని భావసారూప్య దేశాలన్నీ సహకారాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉందని రక్షణమంత్రి అన్నారు. కాగా భారత్ అందజేసిన ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌకను సోలిహ్ మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్(ఎండిఎన్‌ఎఫ్)కు అందజేశారు. ఈ కోస్ట్‌గార్డు నౌకతోఎండిఎన్‌ఎఫ్ తీరప్రాంత రక్షణ, భద్రతా సామర్థాలు గణనీయంగా పెరుగుతాయని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది.

Also Read: బురదలో కూరుకుపోయిన మోడీ హెలికాప్టర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News