Saturday, March 29, 2025

హార్లే బైక్‌లపై దిగుమతి సుంకం తగ్గించనున్న భారత్

- Advertisement -
- Advertisement -

అమెరికా నుంచి దిగుమతి అయ్యే హార్లే- డేవిడ్సన్ బైక్ లు, బోర్బన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్లపై సుంకాన్ని భారతదేశం తగ్గించే అవకాశం ఉంది. అమెరికా – భారత మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలలో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఉభయ దేశాలు వాణిజ్యం సంబంధాలను పెంచుకునే లక్ష్యంతో పరస్పరం సుంకాలను గణనీయంగా తగ్గించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాయని వాణిజ్యవర్గాలు తెలిపాయి.హార్లే -డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికే 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఈ టారిఫ్ ను మరింత తగ్గించే అంశం ప్రధానంగా చర్చల్లో ఉంది. దీనివల్ల హార్లే బైక్ మరింత సరసమైన ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉండవచ్చు.

అలాగే బోర్బన్ విస్కీ పై దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. ఉభయదేశాలు మధ్య వాణిజ్యం పెంచుకునేందుకు ఈ సుంకాన్ని మరింత తగ్గించే విషయం పరిశీలిస్తున్నారు.అలాగే కాలిఫోర్నియా వైన్ పై సుంకం కూడా భారతదేశంలో బాగా తగ్గవచ్చు.వాణిజ్య చర్చలు మోటర్ సైకిళ్లు, మద్యం సుంకాలకే పరిమితం కాలేదు. ఔషధాలు, కీలకమైన రసాయనాలు వంటి రంగాలకూ విస్తరింపజేయాలని భావిస్తున్నారు.అయితే, ప్రపంచంలోనే జనరిక్ ఔషధ మార్కెట్ లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది.అమెరికా నుంచి ఔషధాల దిగుమతులు పెరిగిన పక్షంలో భారతీయ ఫార్మస్యూటికల్
ఉత్పత్తిదారులపై ప్రభావం పడవచ్చునని భావిస్తున్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News