Monday, December 23, 2024

హాకీలో భారత్‌కు మూడో ర్యాంక్

- Advertisement -
- Advertisement -

India Men Team rise to 3rd spot in Hockey Rankings

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సంఘం సోమవారం తాజాగా ప్రకటించిన పురుషుల టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. మరోవైపు మహిళల జట్టు ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల ఇంగ్లండ్, జర్మనీలతో జరిగిన పోటీల్లో భారత పురుషుల జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. దీంతో టీమ్ ర్యాంక్ కూడా మెరుగైంది. ఇంగ్లండ్‌పై మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. అంతేగాక జర్మనీపై కూడా జయకేతనం ఎగుర వేసింది. దీంతో నెదర్లాండ్స్‌ను వెనక్కినెట్టి భారత టీమ్ మూడో ర్యాంక్‌కు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. బెల్జియం రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకొంది. మరోవైపు మహిళల విభాగంలో భారత్ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల అగ్రశ్రేణి జట్టు నెదర్లాండ్స్‌పై విజయం సాధించడం భారత్‌కు కలిసి వచ్చింది.

India Men Team rise to 3rd spot in Hockey Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News