Sunday, January 19, 2025

హాకీ సెమీస్‌లో భారత్

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ : ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో భారత్ 120 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో భారత్ నాకౌట్‌కు అర్హత సాధించింది. ఆట రెండో నిమిషంలోనే భారత్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్‌ను నమోదు చేసింది. తర్వాతి నిమిషంలోనే మరో గోల్ దక్కింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 60 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా భారత్ హవా కొనసాగించింది. ఈసారి మరో ఆరు గోల్స్‌ను నమోదు చేసింది. బంగ్లాదేశ్ ఒక్క గోల్ కూడా సాధించలేక పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News