Sunday, January 19, 2025

జులై 29-30న మణిపూర్‌కు ప్రతిపక్ష ఇండియా ఎంపీల ప్రతినిధి బృందం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ దెబలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) కూటమికి చెందిన ఎంపీల ప్రతినిధి బృందం జులై 29-30 తేదీలలో సంక్షుభిత మణిపూర్‌ను సందర్శించనున్నది. గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చాంబర్‌లో సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన ఇండియా కూటమి ఎంపీలు మణిపూర్‌ను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్తితిని తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇలా ఉండగా.. మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వ వైఖరికి నిరసన సూచనగా నల్లదుస్తులు ధరించి ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందినన ఎంపీలు గురువారం రాజజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికారున్ ఖర్గే చాంబర్‌లో సమావేశమై పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించి దరిమిలా సభలో మరే ఇతర అంశాన్ని అనుమతించకూడదని ప్రతిపక్ష నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు వర్గాలు తెలిపాయి. ఇతర అంశాలను సభలో చేపట్టే ముందుగా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుందని ప్రతిపక్ష ఎంపీలు భావిస్తున్నట్లు వారు చెప్పారు.

మణిపూర్‌పై చర్చకు అనుమతించకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఉభయసభలలో ప్రకటన చేయకపోవడానికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరైనట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News