Monday, December 23, 2024

రాజ్యసభలో ‘ఇండియా’ ఎంపీల వాకౌట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరపాలని, చర్చకు ప్రధాని మోడీ సమాధానమివ్వాలన్న డిమాండ్‌పై పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఈ అంశంపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష కూటమి‘ ఇండియా’కు చెందినసభ్యులు వాకౌట్ చేశారు. సభ ప్రారంభం కాగానే ఇదే అంశంపై ప్రతిపక్ష సభ్యులు గొడవ చేయడం ప్రారంభించడంతో చైర్మన్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

35 నిమిషాల పాటు వాయిదాపడిన అనంతరం సభ తిరిగి సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఇదే అంశంపై పట్టుబడుతూ నినాదాలు కొనసాగించారు. నినాదాల మధ్యనే చైర్మన్ ధన్‌కర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైనప్పట్నించి కూడా విపక్ష సభ్యులు ‘మణిపూర్, మణిపూర్’ అంటూ నినాదాలు చేస్తూనే వచ్చారు. అయినా చైర్మన్ పట్టించుకోకపోవడంతో విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ విప్ జైరాం రమేశ్ ట్వీట్‌లోఈ విషయం తెలియజేశారు. చర్చ అనంతరం ప్రకటన చేసేందుకు ప్రధాని సభలో ఉండాలని ఈ రోజు కూడా ‘ఇండియా’ పార్టీలు డిమాండ్ చేశాయని, సభా నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12.25 గంటల ప్రాంతంలో కూటమికి చెందిన అన్ని పార్టీలు వాకౌట్ చేశాయని జైరాం రమేశ్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News