Monday, November 18, 2024

భారత్‌కు బలమైన నేత అవసరం

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలో యుద్ధాలు త్వరలో ముగియవు
విదేశాంగ మంత్రి జైశంకర్
సిమ్లా : ప్రపంచంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, ప్రస్తుతం సాగుతున్న యుద్ధాలు ఇప్పట్లో ముగిసేలా లేవని, ఈ పరిస్థతిలో ప్రతిష్ఠ, గౌరవం, సుస్థిర ప్రభుత్వంతో దృఢమైన, శక్తిమంతమైన నేత భారత్‌కు అవసరమని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం చెప్పారు. సిమ్లాలో ఎంపిక చేసిన కొందరు మీడియా వ్యక్తులతో జైశంకర్ ముఖాముఖి సాగిస్తూ, రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- గాజా-ఇరాన్‌లో ప్రస్తుతం యుద్ధాలు సాగుతున్నాయని, భారత సరిహద్దులలో కూడా సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. భారత్‌కు బలమైన నాయకత్వం ఉందనే విస్పష్ట సందేశం వెళ్లాలని ఆయన సూచించారు.

‘ప్రపంచం ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం సాగుతున్న యుద్ధాలు అంత త్వరగా ముగియవు. అందుకు నెట్‌వర్కింగ్, ప్రతిష్ఠ, గౌరవం ఉన్న దృఢమైన, శక్తిమంతమైన నేతతో సుస్థిర ప్రభుత్వం భారత్‌కు అవసరం’ అని మంత్రి అన్నారు. ‘రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మీ కుటుంబం ఉక్రెయిన్‌లో ఉంటే దేశం అగ్ర పీఠంలో ఎవరిని మీరు కోరుకుంటారు .. ప్రధాని నరేందర మోడీనీ లేక మరి ఏ ఇతర నేతనా’ అని జైశంకర్ ప్రశ్నించారు. ‘నాలుగు సంవత్సరాల సంక్లిష్ట సమయాలను చూశాను.

మన సరిహద్దుల్లో అటువంటి ఘర్షణలు సంభవించవచ్చు కనుక వోటర్లు విజ్ఞతతో వోటు వేయాలి’ అని జైశంకర్ మీడియా సిబ్బందితో అన్నారు. ‘చైనా 1962లో కైవసం చేసుకున్న ప్రదేశంలో రోడ్లు, వంతెనలు, సరిహద్దులో ఒక మోడల్ గ్రామాన్ని నిర్మిస్తోంది, పాకిస్తాన్‌తో సమన్వయంతో సియాచెన్‌లో రోడ్డు వేసింది. భారత్ కూడా బలగాలను మోహరించింది, సరిహద్దులో మౌలిక వసతులు మెరుగుపరచింది, భారత్- చైనా సరిహద్దు కోసం బడ్జెట్‌ను రూ. 3000 కోట్ల నుంచి రూ. 15 వేల కోట్లకు పెంచడమైంది’ అని మంత్రి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News