Wednesday, January 22, 2025

భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi

అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘కిచిడీ’ ప్రభుత్వం వస్తేనే మంచిదని కూడా ఆయన అన్నారు. ‘ఆప్’ పార్టీ అధికారంలో ఉన్న బిజెపికి భిన్నమైనదేమి కాదని తెలిపారు. బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వం నోరు మూసుకుని కూర్చుందని కూడా ఆయన విమర్శించారు. గుజరాత్‌లో డిసెంబర్‌లో జరుగనున్న ఎన్నికల్లో మజ్లీస్ తన అభ్యర్థిని పోటీకి నిలబెడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత శక్తిమంతంగా ఎదిగిన నరేంద్ర మోడీని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చైనా చొరబాటు, కార్పొరేట్ పన్ను రద్దు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ‘సిస్టం’ను నిందించారే తప్ప సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. ‘అందుకే నేను దేశానికి బలహీన ప్రధాని రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓ బలహీన ప్రధానే బలహీనులు స్థితిగతులు అర్థం చేసుకుంటాడు. శక్తిమంతుడైన ప్రధాని కేవలం సంపన్నులకే మేలు చేస్తాడు’ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ‘కిచిడీ ప్రభుత్వం’ వస్తేనే మేలన్నారు. అయితే ఏమవుతుందో వేచి చూద్దాం అన్నారు.

‘రేవ్డీ’(ఉచితాలు)మీద రాజకీయ చర్చ గురించి మాట్లాడుతూ ప్రధాని కార్పొరేట్ పన్నును పారిశ్రామికవేత్తలకు మాఫ్ చేశాడు అన్నారు. ఆప్ కూడా బిజెపిలాగానే మాట్లాడుతుందన్నారు. బిల్కిస్ బానో గురించి ఆప్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే అది బిజెపికి ప్రయోజనం కాగలదని, అలాకాక అందరం కలసికట్టుగా మోడీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని అన్నారు. 2020లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు నితీశ్ కుమార్ బిజెపితో పొత్తు కుదుర్చుకున్నాడని అన్నారు. నేడతను వేరేవాళ్లతో చేతులు కలిపారన్నారు. రాజకీయ పార్టీలు నేడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి విషయాలను పక్కకు పెట్టేసి హిందుత్వనే ముఖ్యాంశంగా మార్చేశాయని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News