ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులకు సన్మానం చేశారు. కార్మికులకు శాలువాలతో ప్రధాని సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఆత్మనిర్భర భారత్‌కు ప్రతీకగా కొత్త పార్లమెంట్ భవనం ఉంది. 2020 డిసెంబర్ 10న కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి 2 ఏళ్ల 5 నెలల 18 రోజులు పట్టగా నిర్మాణ వ్యయం దాదాపు రూ.1200 కోట్లుగా ఉంది. నాలుగు అంతస్థుల్లో కొత్త పార్లమెంట్ భవనం ఉంది. లోక్‌సభలో 888 సీట్లు, రాజ్యసభలో 384 సీట్లు ఉన్నాయి. లోక్ సభ హాల్‌లో 1272 సీట్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. ప్రతి సభ్యుడి సీటు వద్ద మల్టీ మీడియా డిస్‌ప్లే సిస్టమ్ ఉంది. జాతీయ పక్షి నెమలి ఆకృతిలో లోక్‌సభ ఛాంబర్ ఉండగా జాతీయ పుష్పం కమలం ఆకృతిలో రాజ్యసభ ఛాంబర్ ఉంది. కొత్త భవనంలో మంత్రుల కోసం 92 గదులు కేటాయించారు. పార్లమెంట్ సభ్యుల సీట్లకు డిజిటల్ టచ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.