- Advertisement -
భారతదేశంలోనే వయసులో అతి పెద్దదైన ఆడపులి రాజమాత కన్నుమూసింది. రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఫారెస్టులో నివసించే రాజమాత కొంతకాలంగా అనారోగ్యంగా ఉంది. మూడు నెలలుగా ఈ ఆడపులిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 19 ఏళ్ల వయసులో రాజమాత శనివారం కన్నుమూసింది.
సరిస్కా రిజర్వ్ ఫారెస్టులో ఒకప్పుడు వేటగాళ్ల తుపాకులకు ఎన్నో పులులు బలైపోయాయి. రిజర్వ్ ఫారెస్ట్ లో అడుగంటిపోయిన పులుల సంతతి పెరిగేందుకు రాజమాత ఎంతో దోహదపడింది. సరిస్కాలో 25మంది పులి పిల్లలకు రాజమాత జన్మనిచ్చింది. రణథంబోర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని మచిలీ అనే ఆడపులికి పుట్టిన రాజమాతను 2008లో సరిస్కా రిజర్వ్ ఫారెస్ట్ కు తీసుకువచ్చారు. అప్పటినుంచీ రాజమాతకు పుట్టిన పులిపిల్లల వల్ల సరిస్కాలో పులుల సంతతి గణనీయంగా వృద్ధి చెందింది.
- Advertisement -