Friday, November 15, 2024

దేశంలో ఒమిక్రాన్ కేసులు 422కు చేరిక

- Advertisement -
- Advertisement -
India Omicron cases tally to 422
130 మంది కోలుకున్నారు: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది పాకింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసలు సంఖ్య 422కు చేరింది. వీరిలో 130 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ఇక 108 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, 79 కేసులతో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో ఉంది. గుజరాత్‌లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్నాటకలో 31 కేసులు వెలుగు చూశాయి. ఇక దేశంలో కరోనా కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 9,45,455 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,6,987 కేసులు వెలుగులోకి వచ్చాయి.

రోజువారీ కరోనా కేసుల సంఖ్య 15 వేలకన్నా తక్కువగా ఉండడం ఇది 59వ రోజు. మరో 162 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 4,79,682కు చేరింది. గడచిన 24 గంటల్లో 7,091 మంది కోలుకోగా, ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.42 కోట్లకు చేరింది. దీంతో రికవరీ రేటు 98.40కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 76,766 యాక్టివ్ కేసులుండగా, ఆ రేటు 0.22 శాతానికి పడిపోయింది. మరో వైపు గడచిన 24 గంటల్లో 32,90,766 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 141.37 కోట్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News