Thursday, January 23, 2025

వేడెక్కిన జాతీయ రాజకీయాలు..

- Advertisement -
- Advertisement -

ముంబయి: వచ్చే లోక్‌సభ ఎనినకల్లో ‘వీలయినంతవరకు’ కలిసే పోటీ చేయాలని ‘ ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. అలాగే సీట్ల సర్దుబాటుతో పాటుగా వివిధ అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్‌డిఎ కూటమిని ఢీకొనేందుకు ఏర్పాటయిన ‘ ఇండియా’ కూటమి మూడో సమావేశం ముంబయిలో రెండో రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక సమావేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకోసం చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు చేశారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలమధ్య వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీచేయాలని కూటమిలోని పార్టీలు తీర్మానం చేశాయి. ఇందులో 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.

కూటమికి సంబంధించిఅత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేకమిటీగా ఈ సమన్వయ కమిటీ వ్యవహరిస్తుంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు ఉమ్మడిగానే పోటీ చేయాలని ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియను వెంటనే ప్రాంభించనున్నట్లు ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.సహకార స్ఫూర్తితో ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.అలాగే దేశంలోని సమస్యలపై వివిధ ప్రాంతాల్లో పలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే వివిధ భాషల్లో‘ బారత్ ఏకమవుతోంది.. ఇండియా గెలుస్తుంది’ అన్న థీమ్‌తో ప్రచార వ్యూహాలను సమన్వయం చేసుకుని పని చేయనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటు ప్రక్రియను ఒక కొలిక్కి తెచ్చేందుకు పని చేయనున్నట్లు సమాచారం. కాగా చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రోను అభినందిస్తూ సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం సామర్థాలను బలోపేతం, విస్తరింప జేసేందుకు ఆరు దశాబ్దాల సమయం పట్టిందని కూడా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

విపక్షాల బలం చూసి ప్రభుత్వానికి భయం: ఖర్గే
కాగా జమిలి ఎన్నికల నిర్వహణ అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా దేశ ప్రజలు మోసపోరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డైన్ మొదలైందని ఆయన స్పష్టం చేశారు. విపక్ష కూటమి బలాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అంతకు ముందు ఇండియా కూటమి సమావేశంలో మాట్లాడుతూ ఖర్గే అన్నారు. ప్రతీకార రాజకీయాల్లో బాగంగా తమపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం దాడులకు పాల్పడే అవకాశముందన్న ఖర్గే వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ముంబయిలో రెండో రోజు జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో భాగంగా దిగిన గ్రూపు ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఖర్గే ‘ భారత్ ఏకమవుతుంది.. ఇండియా గెలుస్తుంది’ అన్న నినాదం ఇచ్చారు.
సమన్వయ కమిటీలో సభ్యులు
ఇండియా కూటమి సమన్వయ కమిటీలో కాంగ్రెస్‌నుంచి కెసి వేణుగోపాల్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, టిఆర్ బాలు(డిఎంకె),ఆర్‌జెడినుంచి తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్‌నుంచి అభిషేక్ బెనర్జీ,శివసేననుంచి సంజయ్ రౌత్, జార్ఖండ్ సిఎం హేమంత్ సౌరేన్, ఆప్ ఎంపి రాఘవ్ చద్దా, సమాజ్‌వాది పార్టీనుంచి జావేద్ అలీఖాన్, జెడి(యు)నుంచి లలన్ సింగ్, సిపిఐ నేత డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్‌నుంచి ఒమర్ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా ముఫ్తీ ఉంటారు. సిపిఎం పార్టీ నేత పేరును ఇంకా ఖరారు చేయలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News