Wednesday, January 22, 2025

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

- Advertisement -
- Advertisement -

ఓవల్ : లండన్‌లోని ఓవల్‌లో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓవల్ వేదికగా కాసేపట్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వరల్డ్ టెస్ట్ ఫైనల్‌కు ముందే భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు కీలక ఆటగాళ్లను కోల్పోయాయి. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ల గాయాలతో మ్యాచుకు దూరం అయ్యారు. అదే సమయంలో, ఆస్ట్రేలియా కూడా వారి స్టార్ ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ తన ఎడమ అకిలెస్‌కు సంబంధించిన సమస్య కారణంగా చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు.

ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ మైదానంలో పేసర్లదే హవా. ఆసీస్ పేసర్లను భారత్ ఎలా ఎదుర్కొంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. అటు చూస్తే భారత్ కు పేసర్ల సమస్య ఉంది. కానీ ఆస్ట్రేలియా ఆశలన్నీ బౌలింగ్ పేనే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ నే నమ్ముకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News