Thursday, January 23, 2025

భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్ డ్రా

- Advertisement -
- Advertisement -

India-Pakistan match draw

ఆసియా కప్ హాకీ టోర్నీ

జకర్తా: ఆసియా కప్ హాకీలో భాగంగా సోమవారం చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్ చివరికి 11తో డ్రా అయ్యింది. ఆరంభం నుంచే ఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. భారత్ ప్రారంభంలోనే గోల్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్ ఆడుతున్న కార్తీ సెల్వం ప్రాంభంలోనే గోల్ చేసి భారత్‌కు 10 ఆధిక్యం అందించాడు. ప్రథమార్ధంలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో భారత్ సఫలమైంది. అయితే ద్వితీయార్ధం ఆఖరి నిమిషంలో పాకిస్థాన్ ఆటగాడు అబ్దుల్ రాణా చిరస్మరణీయ గోల్ చేశాడు. దీంతో మ్యాచ్ అనూహ్యంగా డ్రాగా ముగిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News