Sunday, January 19, 2025

లోక్‌సభ ఎన్నికల్లో కలిసే పోటీ..సీట్ల పంపకంపై వెంటనే చర్చలు: ఇండియా కూటమి

- Advertisement -
- Advertisement -

ముంబై: రానున్న లోక్‌సభ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు సమైక్యంగా పోటీచేయాలని ఇండియా కూటమి పార్టీలు తీర్మానించాయి. వివిధ రాష్ట్రాలలో సీట్ల పంపకం ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని, ఇచ్చి పుచ్చుకునే రీతిలో సమైక్య స్ఫూర్తితో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఇండియా కూటమి పార్టీలు శుక్రవారంముంబైలో జరిగిన రెండవరోజు సమావేశంలో తీర్మానించాయి.

దేశంలోని వివిధ రాష్ట్రాలలో సాధ్యమైనంత త్వరలో ప్రజా సమస్యలపై బహిరంగ సభలు, ర్యాలీలు సమైక్యంగా నిర్వహించాలని కూడా తమ కూటమి తీర్మానించినట్లు ఇండియా కూటమి నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా నినాదాన్ని వివిధ భాషలలో ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, తమ ప్రచార వ్యూహాలను సమన్వయంతో చేపట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

నేటి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా వెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News