Sunday, January 19, 2025

2 లక్షల నుంచి 15 లక్షలకు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇటీవల దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్(ఆటిఆర్)ల దాఖలుకు చివరి తేదీ జూలై 31తో ముగిసింది. ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌ల గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) ఈ ఏడాది ఆదాయపు పన్ను డేటాను విశ్లేషించిన ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో భారతీయుల తలసరి ఆదాయం రూ.2 లక్షలు ఉండగా, ఇది 2047 సంవత్సరం నాటికి అనేక రెట్లు పెరనుంది. ఇటీవల ముగిసిన ఐటిఆర్ ఫైలింగ్ ప్రక్రియను పరిశీలిస్తే

తక్కువ ఆదాయం కల్గిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. టాక్స్ పేయర్ల ఆదాయం అనేక రెట్లు పెరగనుందని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) నివేదిక ప్రకారం, భారతీయుల తలసరి ఆదాయం 2023లో రూ.2 లక్షల నుంచి 204647 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14.9 లక్షలకు చేరనుంది. ఎస్‌బిఐ అసెస్‌మెంట్ సంవత్సరం 2012 నుండి అసెస్‌మెంట్ సంవత్సరం 2023 వరకు అంచనా వేసింది. దేశంలో జనాభా పెరుగుదలతో పాటు దేశంలో పన్నుల వ్యవస్థ మరింత సమర్థవంతంగా ఎలా మారుతుందో, అలాగే దాని గణాంకాలు ఏవిధంగా మెరుగుపడుతున్నాయనే విషయాన్ని నివేదిక వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News