Wednesday, January 22, 2025

యుఎఇ, బంగ్లాదేశ్ లకు 64,400 టన్నుల ఉల్లి ఎగుమతికి అనుమతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిలీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), బంగ్లాదేశ్‌లకు 64,400 టన్నుల ఉల్లి ఎగుమతికి కేంద్రం నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్టు సంస్థ ( ఎన్‌సిఇఎల్ ) ద్వారా అనుమతించింది. బంగ్లాదేశ్‌కు 50,000 టన్నులు, యుఎఇకి 14,400 టన్నుల ఉల్లి ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ( డిజిఎఫ్‌టి) నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. డిజిఎఫ్‌టి వాణిజ్య మంత్రిత్వ విభాగం.

దిగుమతులు, ఎగుమతుల వ్యవహారాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ, మిత్రదేశాల అవసరాల దృష్టా పరిమితంగా కేంద్రం ఎగుమతికి అనుమతిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 8న ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఇది అమలులో ఉంటుంది. గృహావసరాలు పెరగడంతోపాటు ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News