- Advertisement -
న్యూఢిల్లీ : పాకిస్థాన్ అభ్యర్థనను భారతదేశం మన్నించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఫిబ్రవరి 23వతేదీ నుంచి శ్రీలంక దేశ పర్యటన కోసం భారత గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతించాలని దాయాది దేశమైన పాకిస్థాన్ చేసిన వినతిని భారత్ అడ్డు చెప్పకుండా అనుమతి మంజూరు చేసింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విమానం భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించినట్లు కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం దేశాధినేతలు వీవీఐపీ విమానాలు ఏ ఇతర దేశాల గగనతలం గుండా వెళ్లినా దానికి అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో పాకిస్థాన్ భారత విమానాలు తమ దేశ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది.
- Advertisement -