Monday, December 23, 2024

లోక్‌సభలో తొలిసారి ‘ ఇండియా’ ప్లకార్డులతో వెల్‌లోకి విపక్ష కూటమి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌పై ప్రధాని మోడీ మాట్లాడాలని ‘ ఇండియా’కోరుకొంటోందని పేర్కొంటూ లోక్‌సభలో శుక్రవారం ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల ఏర్పాటు అయిన విపక్ష కూటమి ఇండియా ప్లకార్డులు ఈ విధంగా తొలిసారి చట్టసభలో కన్పించాయి. ఇంతకాలంగా మణిపూర్‌పై ప్రధాని మౌనంగా ఉన్నారని, ఇకనైనా ఆయన నుంచి ప్రకటన అవసరం అని ప్రతిపక్ష కూటమి డిమాండ చేసింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు ఈ ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకువెళ్లారు. తాము ఇదే విషయంపై సోమవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీజి విగ్రహం వద్ద ఇండియా తరఫున సంయుక్త ధర్నాకు దిగుతామని కూడా ప్రతిపక్షాలు ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News