ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది. అసాధారణ ఆటతో చెలరేగిన కొరియా మ్యాచ్‌ను డ్రాగా ముగించి భారత్‌కు షాక్ ఇచ్చింది. ఆరంభంలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో నిమిషంలోనే ఉపాధ్యాయ్ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను కంగుతినిపిస్తూ అతను ఈ గోల్‌ను నమోదు చేశాడు. ఆ తర్వాత భారత్ మరింత దూకుడుగా ఆడింది. ఇక హర్మన్‌ప్రీత్ సింగ్ 33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ తీవ్ర ఒత్తిడిలోనూ కొరియా అద్భుత ఆటను కనబరిచింది. ఎటాకింగ్ గేమ్‌తో భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో కీలకమైన రెండు గోల్స్‌ను సాధించి మ్యాచ్‌ను 22తో డ్రా చేసింది. ఇక సునాయాసయంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది.
భారత్‌ను నిలువరించిన కొరియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -