Wednesday, January 22, 2025

కోవిడ్ ఔషధం, వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్‌ది కీలక పాత్ర: జెరెమీ ఫర్రార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోవిడ్19 మహమ్మారి మూడేళ్లలో వ్యాక్సిన్‌ల అభివృద్ధి, ఔషధం, వ్యాధినిర్ధారణ, థెరప్యూటిక్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ జెరెమీ ఫర్రార్ మంగళవారం తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన మూడో జి20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టతలు, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ జి20కి ఆతిథ్యం ఇచ్చిన తీరును ప్రశంసించారు.

‘విశ్వవ్యాప్త కవరేజ్, ప్రాథమిక సంరక్షణ, భవిష్యత్తులో మనం మరింత సమానమైన ప్రపంచంలో జీవించేలా డిజిటల్ ఆరోగ్యం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించింది’ అన్నారు.

మూడో జి20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జూన్ 4 నుండి 6 వరకు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇది ఆరోగ్య ట్రాక్‌లో మూడు ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తోంది.

వాటిలో ఒకటి ఆరోగ్య అత్యవసర నివారణ, సంసిద్ధత, యాంటీమైక్రోబయల్ నిరోధకత.

రెండవది సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన, సరసమైన వైద్య ప్రతిఘటనల ప్రాప్యత,లభ్యతలను సాధించి ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం.

మూడవది డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు, సార్వత్రిక ఆరోగ్య కవరేజీకి ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి పరిష్కారాలు.

Sir Jeremy Farrar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News