Monday, December 23, 2024

కుర్రాళ్లకు భలే ఛాన్స్

- Advertisement -
- Advertisement -

నేడు సౌతాఫ్రికాతో భారత్ ఢీ

India playing 11 vs south africa

న్యూఢిల్లీ: రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అశ్విన్, బుమ్రా, షమి, జడేజా వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. ఇక తొలి మ్యాచ్ ఆరంభానికి ముందే కెప్టెన్ కెఎల్.రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం విశేషం.

అయితే ఇటీవలే ముగిసిన ఐపిఎల్‌లో ఆడడం భారత ఆటగాళ్లకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌లు టీమిండియాకు కీలకంగా మారారు. ఈ సిరీస్‌లో జట్టు వీరిపైనే భారీ ఆశలు పెట్టుకొంది. ఇక శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక ఐపిఎల్‌లో సత్తా చాటిన భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు పర్యాటక సౌతాఫ్రికా కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల ముగిసన ఐపిఎల్‌లో అసాధారణ రీతిలో రాణించిన డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, మార్‌క్రామ్‌లపై జట్టు ఆశలు నిలిచాయి. మిల్లర్ ఫామ్‌లో ఉండడం సౌతాఫ్రికాకు కలిసి వచ్చే అంశం. అతను విజృంభిస్తే భారత్‌కు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక కెప్టెన్ తెంబా బవుమా, వండర్‌డుసెన్, రీజా హెండ్రిక్స్, డికాక్‌లతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక నోర్జే, ఎంగిడి, రబడా, కేశవ్ మహరాజ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News