హైదరాబాద్: భారత్ లో ప్రస్తుతం నాణ్యమైన ఆటగాళ్లు 50 మంది ఉన్నారని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హఖ్ అన్నాడు. టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఒకటి విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుండగా మరొకటి శిఖర్ ధావన్ నాయకత్వంలో శ్రీలంకలో మరో జట్టు పర్యటించనుంది. ఒకే దేశం నుంచి రెండు జాతీయ జట్లు ఆడటం భారత్‌కే చెల్లిందని ఇంజమామ్ ప్రశంసించారు. గతంలో ఆస్ట్రేలియా ఇలానే చేయాలని ప్రయత్నించినప్పటికి ఐసిసి నుంచి అనుమతి దొరకలేదు. అప్పుడు ఆసీస్ చేయలేని పని ఇప్పుడు భారత్ చేస్తోందన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్, క్వారంటైన్ ఆంక్షల్లో మంచిగానే కనిపిస్తున్నాయన్నారు. శ్రీలంకకు వెళ్తున్న జట్టు కూడా అసలైన టీమిండియాలాగానే కనిపిస్తోందని ఇంజమామ్ కొనియాడారు. భారత్‌లో దేశవాలీ క్రికెట్ విధానంతో పాటు ఐపిఎల్ తో మెరికలాంటి ఆటగాళ్ల ప్రతిభ బయటకు వచ్చిందన్నారు. ప్రస్తుతం బిసిసిఐ 50 మంది ఆటగాళ్లను తయారు చేసిందన్నాడు. 1998లో కామన్వెల్త్ క్రీడల కోసం రెండు జట్లుగా విడిపోయినప్పుడు భారత్ విజయవంతం కాలేదన్నాడు.
అప్పుడు ఆసీస్ చేయలేదు.. ఇప్పుడు భారత్ చేస్తోంది: ఇంజమామ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -