Saturday, November 16, 2024

దేశంలో 9.4 శాతానికి పెరిగిన విద్యుత్ వినియోగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత ఏడాదితో పోల్చుకుంటే దేశంలో విద్యుత్ వినియోగం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ అక్టోబర్ కాలంలో 9.4 శాతానికి అంటే దాదాపు 984.39 బిలియన్ యూనిట్ల వరకు పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, వాతావరణ పరిస్థితులే దీనికి కారణంగా స్పష్టమౌతోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 202223 ఏప్రిల్ అక్టోబర్ కాలంలో విద్యుత్ వినియోగం 899.95 బిలియన్ యూనిట్లు కాగా, 2022లో ఇదే కాలంలో 215.88 గిగావాట్ వరకు విద్యుత్ వినియోగం కాగా, ఈ ఏడాది ఏప్రిల్ అక్టోబర్ మధ్యకాలంలో 241గిగావాట్‌ల వరకు విద్యుత్ వినియోగం జరిగిందని మరో సూచిక తెలియజేసింది. అక్టోబర్‌లో పండగల సీజన్, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల దేశంలో విద్యుత్ వినియోగం 22 శాతం వరకు పెరిగి 138.94 బిలియన్ యూనిట్లకు చేరుకుంది.

ఏడాది క్రితం ఇదే నెలలో విద్యుత్ వినియోగం 113.94 బిలియన్ యూనిట్ల వరకు జరిగింది. అంతకు ముందు సంవత్సరం 2021లో ఇదే నెలలో 112.79 బిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం జరిగింది. గత రెండు నెలల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని టాటా పవర్ ఢిల్లీ పంపిణీ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లో టాటా పవర్‌ఢిల్లీ పంపిణీ సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగం 10.16 శాతం వరకు వెళ్లి 845 మిలియన్ యూనిట్ల వినియోగమైంది. అదే 2022 అక్టోబర్‌లో 767 మిలియన్ యూనిట్ల వినియోగం జరగింది. శీతాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడం, పండగల సీజన్ కారణం గానే విద్యుత్ వినియోగం భారీగా జరిగిందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News