Friday, December 20, 2024

ఆహార భద్రత ఏది?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆహార భద్రత పేరుతో పేదలకు ఉచిత బియ్యం అందజేస్తూ కేం ద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోంది. మ రో వైపు పోషకాలతో కూడిన ఆహారం లభించక దేశంలో కోట్లాది మంది బక్కచిక్చి రోగాల బారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం కూడా గిడ్డంగుల్లో ముక్కిపోయి రంగు మారి తినడానికి ఏ మాత్రం వీలుకాక 70శాతం మంది లబ్ధ్దిదారులు వాటిని ఇతర అవసరకాల కింద తరలిస్తున్నారు. పేదలకు ఇచ్చిన బియ్యం మరో మా ర్గంలో వ్యాపారులు కొనుగోలు చేసి హోటళ్లలో ఇ డ్లీలు , దోసెలు, చేగోడిలు వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఆహార ధాన్యాలు బయటి మార్కెట్‌లో కొనుగోలు చేసే శక్తిలేని వారు ఉచిత బి య్యంతోనే ఆహారపు తీర్చుకుంటున్నారు. చౌక దుకాణాల ద్వారా చిరుధాన్యాలు కూడా సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తు న్న ప్రకటనలు మాటలకే పరిమితం అవుతున్నా యి. ఒక్క బియ్యం పథకంతోనే కేంద్రం ఏళ్ల డి నెట్టుకొస్తోంది. ఇదివరకు ఈ పథకం ద్వారా బియ్యంతో కందిపప్పు, శనగపప్పు, చక్కెర వంటి ఐదారు రకాల నిత్యావసర సరుకులను ప్రభుత్వం తక్కువ ధరకు అందజేసేది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం  ఏర్పడ్డాక బియ్యం తప్ప మరే ఇతర సరుకులు అందటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సుమారు 80కోట్ల మందికి బియ్యం చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోంది. చిరుధాన్యాలు కూడా పంపిణీ చేస్తామని కేంద్ర అహారశాఖ మంత్రి గోయిల్ ఏడాది కిందట చేసిన ప్రకటన ఇప్పటికీ కార్యరూపంలోకి రాలేదు. దేశంలో 22.4కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఆహార రంగం నిపుణలు చెబుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పోషకాహార లోపంతో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో బిజేపి సర్కారు గత ఏడాది కాలంగా మీనమేషాలు లెక్కపెడుతూ వస్తోంది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ చిరుధాన్యాల సన్నాహక సదస్సులో పాల్గొన్నారు. 2023ను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రతిపాదించగా.. ప్రపంచ ఆహార సంస్థ కూడా అందుకు ఆమోదముద్ర వేసింది. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందజేస్తామని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఈ దిశగా ఏవిధమైన కదలిక లేదంటున్నారు.ఆకలి సూచిలో దేశం మరింత దిగజారింది. 121దేశాల జాబితాతో విడుదలైన ఆకలి సూచీ లిస్ట్‌లో మనదేశం 101వ స్థానంనుంచి 107 స్థానంలోకి చేరటం కేంద్ర ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతోందని రాష్ట్ర పురపాలక ఐటి శాఖల మంత్రి కేటిఆర్ ఎద్దవా చేశారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో నరేంద్రమోడి నేతృత్వంలోని బిజేపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కేటిఆర్ చేసిన ట్వీట్‌కు ప్రజలనుంచి మంచి స్పందన వస్తోంది. ఒక వైపు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు రైతు అనుకూల పధకాల ద్వారా వ్యయవసాయరంగంలో దూసుకుపోతోంది. కోటి 40లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగును పెంచి తన సత్తా చాటుకుంటోంది. ఒక్క ధాన్యం ఉత్పత్తిలోనే పంజాబ్‌తో పోటీ పడుతూ 3.50కోట్ల టన్నుల దిగుబడిని సాధించింది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలులు నిల్వకు జాగా లేదంటూ చేతులెత్తిసిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించటంలో చూపుతున్న శ్రద్ద ఏపాటిదో దీన్ని బట్టే తెలుస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

India Ranked 107 in World Hunger Index 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News