Monday, December 23, 2024

టాప్-5లోకి భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతంగా రాణించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నా భారత హాకీ టీమ్(పురుషులు) రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానానికి ఎగబాకింది. సోమవారం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ర్యాం కింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ పట్టికలో భారత్ 5వ స్థానంలో నిలిచింది.

ఒలింపిక్స్ ముందు 7వ స్థానంలో ఉన్న భారత్ ఏకంగా రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. తాజాగా ముగిసిన విశ్వ క్రీడల్లో స్వర్ణంతో మెరిసి నెథర్లాండ్స్ అగ్ర స్థానంలో నిలువగా.. రజకం సాధించిన జర్మనీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్, బెల్జియం జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News