Wednesday, January 22, 2025

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ అంతమొందిచడానికి ప్రపంచ దేశాలు పలు వ్యాక్సిన్లను తీసుకొచ్చారు. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో గడిచిన 24 గంటల్లో 166 కొత్త కరోనా కేసులు బయటపడ్డట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇందులో అధిక కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం కలకలం రేపుతోంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 895కు చేరింది. చలికాలం కావడంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News