Monday, January 20, 2025

భారత్‌లో 24 గంటల్లో 11692 కొత్త కోవిడ్ కేసులు!

- Advertisement -
- Advertisement -
19 మంది మృతి!!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 11692 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో తొమ్మిది మంది సహా దేశవ్యాప్తంగా మొత్తం 19 మంది మరణించారు. మొత్తం యాక్టివ్ కేస్‌లోడ్ ఇప్పుడు 66170కి చేరుకుంది. నిన్న 12591 కేసులు నమోదు కాగా నేడు గణనీయంగా తగ్గిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.09 శాతంగా ఉంది. వీక్లి పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.33గా ఉంది. ఒక్క రోజులోనే మొత్తం 229739 మందికి పరీక్షలు నిర్వహించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 98.67 శాతంగా ఉంది. సంక్రమణల్లో 0.15 శాతం క్రియాశీలక కేసులు ఉన్నాయి. 10780 మంది రికవర్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 44272256కు చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రయివ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు. గత 24 గంటల్లో 3647 డోసులు ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News