న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది. ఇందులో 4,41,04,933 మంది ఇప్పటికే కోలుకోగా, 5,29,016 మంది బాధితులు కోవిడ్-19 భారిన పడి ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 18,317 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 2160 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.63 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ లో ప్రకటించింది.
India records 1,604 new COVID19 cases in the last 24 hours; Active caseload stands at 18,317.
— ANI (@ANI) October 30, 2022