న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 176 కొవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో భారత్ కరోనా కేసుల సంఖ్య 44675952కు చేరుకుంది. కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3552కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోవడంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 530672కు చేరింది. తాజాగా చనిపోయిన ఐదుగురిలో నలుగురు కేరళలో, ఒకరు మహారాష్ట్రలో చనిపోయారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను ఆదివారం ఉదయం 8.00 గంటలకు నవీకరించింది.
మొత్తం కేసు లోడ్‌లో ఈ యాక్టివ్ కేసులు 0.01 శాతం. కాగా జాతీయ కొవిడ్-19 నుంచి కోలుకున్న వారి(రికవరీ) రేటు 98.8 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ పేర్కొంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసుల లోడ్‌లో 56 కేసులు తగ్గాయి. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 44141728 సంఖ్యకు చేరుకుంది. కాగా మరణాల సంఖ్య 1.19 శాతంగా నమోదయింది. దేశవ్యాప్తంగా 220 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వడం జరిగింది.
2020 ఆగస్టు 7న కొవిడ్19 వ్యాధి గంణాంకాలు 20 లక్షలను దాటింది. 2020 ఆగస్టు 23 నాటికి అది 30 లక్షలకు చేరుకుంది. 2020 సెప్టెంబర్ 5 నాటికి అది 40 లక్షలకు, 2020 సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలకు, 2020 సెప్టెంబర్ 28 నాటికి 60 లక్షలకు, 2020 అక్టోబర్ 11 నాటికి 70 లక్షలు, 2020 అక్టోబర్ 29 నాటికి 80 లక్షలు, 2020 నవంబర్ 20 నాటికి 90 లక్షలు, 2020 డిసెంబర్ 19 నాటికి కోటి మార్కును చేరుకుంది. కాగా దేశంలో కొవిడ్ కేసులు 2021 మే 4 నాటికి రెండు కోట్ల మైలురాయిని దాటింది. అది చాలా గడ్డు కాలం. ఆ తర్వాత 2021 జూన్ 23 నాటికి మూడు కోట్లు, ఈ ఏడాది జనవరి 25 నాటికి నాలుగు కోట్ల మైలు రాయికి అది చేరుకుంది.