Friday, November 15, 2024

భారత్‌లో 201 కొత్త కోవిడ్ కేసులు!

- Advertisement -
- Advertisement -
3397కు పెరిగిన యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 201 కరోనా సంక్రమణ కేసులు పెరిగాయి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 4.46 కోట్లకు చేరింది. కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3397కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. కేరళలో ఒకరు మరణించడంతో కరోనా మరణాల సంఖ్య మొత్తం 530691కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటాను ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసింది. రోజువారీ పాజిటివ్ కేసులు 0.15 శాతంగాను, వారం వారీగా పాజిటివిటీ 0.14 శాతంగాను ఉంది.
ఇప్పటి వరకు కొవిడ్19 పరీక్షలు మొత్తంగా 90.97 కోట్లు నిర్వహించినట్లు, గత 24 గంటల్లో 136315 నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొత్తం సాంక్రమిక కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా కొవిడ్ రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని కూడా ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కొవిడ్19 కేసులు 17కు పెరిగినట్లు కూడా తెలిపింది.

కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 44142791. కాగా మరణాలు 1.19 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకు ఇండియాలో కొవిడ్ కేసులు 4.46 కోట్లు(44676879)గా నమోదయింది. దేశవ్యాప్తంగా 220.04 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ పేర్కొంది. కొవిడ్ కేసుల విషయంలో 2021 మే 4న రెండు కోట్లు, 2022 జూన్ 23 నాటికి మూడు కోట్లు, 2022 జనవరి 25 నాటికి నాలుగు కోట్ల మార్కును భారత్ అధిగమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News