- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 260 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 1828 కి పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా సోమవారం వెల్లడించింది. సోమవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన తాజా వివరాల ప్రకారం మృతుల సంఖ్య 5,33,317 వరకు నమోదైంది. మొత్తం కొవిడ్ కేసులు సంఖ్య 4.50 కోట్ల వరకు ఉంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,69,931కు పెరిగింది. రికవరీ రేటు 98.81 గా ఉంది. మరణాల రేటు 1.19 గా నమోదైంది. ఆరోగ్యమంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇంతవరకు పంపిణీ అయ్యాయి.
- Advertisement -