Thursday, January 23, 2025

దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు ఆదివారం నాటికి 3,451

- Advertisement -
- Advertisement -

Covid cases

న్యూఢిల్లీ: ఆదివారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారతదేశంలో 3,451 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 40 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, గత 24 గంటల్లో మరణాల సంఖ్య  దాదాపు రెండు రెట్లు పెరిగింది. నిన్నటి రోజున మరణాలు 22 అయితే, నేడు(ఆదివారం) 40కి పెరిగింది. ఆదివారం నాటికి యాక్టివ్ కేసులు 20,635కు చేరుకుంది. గత 24 గంటల్లో 332 కేసులు పెరిగాయి. కాగా 3,079 మంది కోలుకున్నారు. ఇదిలావుండగా ఇండియాలో రోజువారీ పాజిటివ్ రేటు 0.96 శాతంగా, వారంవారీ పాజిటివ్ రేటు 0.83 శాతంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News